KMR: పిట్లం మండలం కేంద్రం, పరిసర గ్రామాల్లో రోడ్లపై రైతులు ధాన్యం ఆరబోస్తున్నారని దీని వల్ల ప్రమాదాలు జరిగి వాహనదారులు మృతి చెందుతున్నారని పిట్లం ఎస్సై వెంకట్రావు శుక్రవారం తెలిపారు. జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర ఆదేశాల మేరకు రోడ్లపై ధాన్యం ఆరబోసిన రైతులపై కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని తెలిపారు.