NTR: భారతీయ సంస్కృతికి ప్రతిబింబమైన దివ్య దీప్తుల దీపావళి పండుగను పురస్కరించుకుని, ఇబ్రహీంపట్నంలో వ్యాపారులు వివిధ రకాల ప్రమిదలను భారీ ఎత్తున విక్రయిస్తున్నారు. జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే ఈ పండుగ సందర్భంగా, భక్తులు దీపారాధన చేసుకునేందుకు ప్రమిదలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఇబ్రహీంపట్నంలో పండగ వాతావరణం నెలకొంది.