NTR: ఇబ్రహీంపట్నంలో జనార్దన్ రావు విక్రయించిన మద్యం నకిలీదే అని తేలింది. అది అత్యంత ప్రమాదకరమైంది కాకపోయినా నిబంధనల ప్రకారం ఉండాల్సిన ప్రమాణాలు లేవని ల్యాబ్ రిపోర్ట్స్ తేల్చాయి. 25గా ఉండాల్సిన UP(అండర్ ప్రూఫ్) 35గా, అలాగే 75గా ఉండాల్సిన OP(ఓవర్ ప్రూఫ్) 65గా ఉన్నట్లు గుర్తించాయి. మద్యం తయారీలో నాణ్యత, గాఢతలను UP, OP తెలియజేస్తాయి.