అన్నమయ్య: జిల్లాలో ఓ టీచర్ సుమారు 50 మంది బాధితుల వద్ద నుంచి రూ. 2 కోట్ల వరకు చీటీల రూపంలో డబ్బు వసూలు చేసి మోసం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. మదనపల్లెకు చెందిన ఈ టీచర్ ప్రస్తుతం తంబళ్లపల్లెలో పనిచేస్తున్నారు. బాధితులు తమ డబ్బును తిరిగి ఇవ్వాలని కోరగా, టీచర్ నిరాకరించడంతో వారు మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో గురువారం ఫిర్యాదు చేశారు.