TPT: దీపావళి పండుగ సందర్భంగా రేణిగుంట పంచాయతీ ఆవరణంలో ఏర్పాటు చేస్తున్న టపాసుల తాత్కాలిక దుకాణాలను తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రతి దుకాణంలో భద్రతా ప్రమాణాలు పాటించాలంటూ వ్యాపారులకు సూచించారు. కాగా, టపాసులు విక్రయానికి సంబంధించిన లైసెన్స్లు, సరైన దూరం, అగ్ని ప్రమాద నియంత్రణ చర్యలను పరిశీలించారు.