గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు మేడికొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పేరేచర్ల జంక్షన్ వద్ద పోలీసులు సైబర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు పోలీస్ అధికారులు ప్రజలకు సూచనలు చేశారు. తెలియని లింకులు, సందేశాలు లేదా ఫ్రెండ్ రిక్వెస్టులు ఓపెన్ చేయవద్దు. బ్యాంక్ వివరాలు, పాస్వర్డ్లు, OTP లాంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని తెలిపారు.