SDPT: హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ గురుకుల పాఠశాలలో ఇటీవల మృతి చెందిన వివేక్ మృతిపై జిల్లా కలెక్టర్ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు ఎల్లేష్ వినతి పత్రం అందజేశారు. విద్యార్థి మృతి చెంది పది రోజులు గడుస్తున్నా, ఏ అధికారిపై చర్యలు తీసుకోక పోవడం దళిత విద్యార్థిపై వివక్ష చూపడం అని అన్నారు. వారం రోజుల్లో దర్యాప్తు చేపట్టకపోతే చలో కలెక్టరేటు పిలుపునిస్తామన్నారు.