ASR: సాగులో సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని కొయ్యూరు ఏవో బీ.రాజ్ కుమార్ రైతులకు సూచించారు. గురువారం రేవళ్లలో పర్యటించారు. రైతులతో కలిసి వరి పంట పొలాలను పరిశీలించారు. వర్షాలకు పంటకు తెగుళ్లు సోకే అవకాశం ఉందన్నారు. పైరుపై తాడుతో రెండు మూడు తిప్పితే పురుగు నీటిలో పడిపోతుందన్నారు. అవసరమైతే క్లోరిఫైరిఫాస్ మందును లీటరు నీటిలో 1.6మి.మీ. కలిపి పిచికారీ చేయాలని తెలిపారు.