MDK: నిజాంపేట మండల కేంద్రంలో గల 108 అంబులెన్స్‌ను గురువారం జిల్లా అధికారి రవికుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబులెన్స్‌లో గల మందు నిల్వలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లాలో వైరల్ ఫీవర్ కేసులు అధికం అవడంతో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 108 సిబ్బంది పనితీరును ఆయన ప్రశంసించారు.