SKLM: మెళియాపుట్టిలోని నడసంద్రంలో డివిజనల్ పంచాయతీ అధికారి ఐ.వి రమణ గురువారం పర్యటించారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ కరపత్రాలు పంపిణీ చేశారు. ఐవీఆర్ఎస్ కాల్స్, చెత్త సేకరణపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. చెత్త ద్వారా సంపద సృష్టించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, క్లాప్ మిత్రలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.