TG: సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్)లో దారుణం జరిగింది. ఆస్తి పంపకాలతో తల్లి అంత్యక్రియలు కూతుళ్లు ఆపేశారు. కొంతకాలంగా అక్కా, చెల్లెళ్ల మధ్య భూ వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే తల్లి చనిపోగా మూడు రోజులుగా తల్లి అంత్యక్రియలు ఆపేశారు. భూముల సమస్య కొలిక్కి వచ్చిన తర్వాతే అంత్యక్రియలు నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. దీంతో గ్రామస్తులంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.