PDPL: పెద్దపల్లి జిల్లా మంథని నుండి ప్రారంభమైన శబరిమల మహా పాదయాత్ర ఈనెల 9న ప్రారంభమై ప్రస్తుతం సిద్దిపేట చేరుకుంది. మంథని హరీష్, శ్రావణ్, మైఖేల్ స్వామి, తాడిచెర్ల కిషన్ స్వాములు యాత్రలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా నాగరాజు గురుస్వామి మాట్లాడుతూ.. భక్తి, నిబద్ధతతో సాగుతున్న ఈ పాదయాత్రలో స్వాములు శబరిమలయ్య ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు.