KNR: హుజురాబాద్ మండలంలోని రాంపూర్ శివారులో నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారిపై ఇసుక ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ చింటూ అక్కడికక్కడే మృతి చెందాడు. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. విలాసాగర్ నుంచి పెద్దపాపయ్య పల్లెకు ఇసుక తరలించి తిరిగి వస్తున్న క్రమంలో, అతివేగంగా నడపడం వల్ల ట్రాక్టర్ బోల్తా పడిందని తెలిపారు.