MDK: తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ తండాలో గురువారం పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేసే కార్యక్రమం చేపట్టినట్లు పశు వైద్యాధికారి డాక్టర్ లక్ష్మీ తెలిపారు. నవంబర్ 14 వరకు నిర్వహించే టీకాల కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. తూప్రాన్ మండలంలో రెండు బృందాలుగా టీకాలు వేస్తున్నట్లు తెలిపారు