E.G: దేవరపల్లి మండలంలో వీధి కుక్కల సంచారం విచ్చలవిడిగా పెరిగిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుక్కలు ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తాయోనని భయంతో ఒంటరిగా వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కుక్కల వ్యాప్తి విపరీతంగా పెరిగిందని, వాటి కట్టడికి అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్ధులు కోరుతున్నారు.