VZM: బొబ్బిలి కమిషనర్ ఎల్.రామకృష్ణ గురువారం స్దానిక రాజా కళాశాల మైదానం, మార్కెట్ ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులను ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మురుగునీటి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. కాలువలలో చెత్త పేరుకుపోవడంతో తొలగించాలని, రోడ్లు, ఖాళీ స్థలాలు, కాలువలలో చెత్త వేయకుండా చూడాలని సూచించారు.