BHPL: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం కలెక్టర్ రాహుల్ శర్మ ఆధ్వర్యంలో నూతనంగా నియమితులైన GPOలకు భూ భారతి దరఖాస్తుల పరిష్కారం పై శిక్షణ ఇచ్చారు. రెవెన్యూ శాఖకు జీపీఓలు (GPO) కళ్లు, చెవుల్లా పనిచేయాలని ఆయన అన్నారు. ఈ శిక్షణ దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.