కోనసీమ: పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు టీడీపీలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీలో చేరి ఇంచార్జ్ పదవి దక్కించుకోవాలన్నదే ఆయన ప్లాన్‌గా సమాచారం. టీడీపీ పెద్దలు చిట్టిబాబును పార్టీలోకి తీసుకువచ్చేందుకు పావులు కదుపుతుండగా.. ఆ పార్టీలోని ఎస్సీ నేతలు అడ్డుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.