BDK: మణుగురు మండలం అశోక్ నగర్లో పోలీసులు గురువారం కమ్యూనిటీ కాంటాక్ట్ లో భాగంగా కార్డెన్ సర్చ్ నిర్వహించారు. డీఎస్పీ రవీందర్ రెడ్డి, బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై నగేష్ పాల్గొని 58 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, ఒక ట్రాలీని సీజ్ చేసినట్లు తెలిపారు. అనంతరం బెల్ట్ షాపులో నడిపే నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.