E.G: పెరవలి మండలం కాకరపర్రు ఫీడర్పై ఆర్డీఎస్ఎస్ పనుల కారణంగా గురువారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ ఈఈ నారాయణ అప్పారావు తెలిపారు. పెరవలి సబ్ స్టేషన్ పరిధిలోని సీతారాంపురం, కాకరపర్రు గ్రామాలకు సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని ఈఈ కోరారు. వ్యవసాయానికి విద్యుత్ యథావిధిగా ఉంటుందని ఆయన తెలిపారు.