BHPL: జిల్లా కోర్టు ప్రభుత్వ ప్లీడర్‌గా ఇటీవల నియమితులైన బొట్ల సుధాకర్‌ను ఇవాళ ఆయన స్వగృహంలో రాష్ట్ర కౌన్సిల్ బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. “బడుగు బలహీన వర్గం నుంచి గొప్ప స్థాయికి ఎదగడం అభినందనీయం” అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జయకర్, వెంకటరత్నం, తదితరులు పాల్గొన్నారు.