NLG: నాలుగు వేర్వేరు తేదీల్లో నాలుగు బైక్లు దొంగిలించిన నిందితుడికి నిడమనూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి స్వప్న 14 నెలల 10 రోజుల జైలు శిక్ష విధించారు. అనుముల మండలం ఆలీనగర్కు చెందిన జానీ, హాలియా బస్టాండ్లో బైక్లు చోరీ చేశాడు. హాలియా పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేయగా, నిందితుడు నేరం ఒప్పుకోవడంతో న్యాయమూర్తి శిక్ష ఖరారు చేశారు.