MNCL: జన్నారం మండలంలోని పోన్కల్లో ఉన్న ఇంటి యజమానులు, వ్యాపారులు అన్ని రకాల పన్నులను చెల్లించి గ్రామ అభివృద్ధికి బాటలు వేయాలని స్థానిక ఈవో రాహుల్ కోరారు. గురువారం ఉదయం ఆయన మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రజలు, వ్యాపారుల నుండి ఆస్తి, నల్ల, ఇంటి పన్నులు రావాల్సి ఉందన్నారు. అలాగే వ్యాపారులు ట్రేడ్ లైసెన్సుల జారీ, పాత వాటిని రెన్యువల్ చేయించుకోవాల్సి ఉందన్నారు.