JN: స్టేషన్ ఘనపూర్ మండలం నమిలిగొండలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఈరోజు ఉదయం ప్రారంభమైంది. MLA కడియం శ్రీహరి ఈ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. దేశంలో ఎక్కడ, ఏ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని, ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ధాన్యం కొనుగోలు జరుగుతుందని తెలిపారు.