ప్రకాశం: కనిగిరి మోడల్ స్కూల్లో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టడం లేదని ఆరోపణలు రావడంతో సమగ్ర శిక్ష అభియాన్ జి సి డి ఓ హేమలత మోడల్ స్కూల్‌ను తనిఖీ చేశారు. భోజన నాణ్యతపై విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రిన్సిపల్ పద్మావతి మెనూ ప్రకారమే నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకుంటున్నారని విద్యార్థులు జి సి డి వోకు తెలిపారు.