AP: కర్నూలు ఎయిర్పోర్ట్కు మరికొద్ది సేపట్లో ప్రధాని మోదీ చేరుకోనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రూ.13,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు సీఎంచంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్నూలు ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. ఈ పర్యటనతో రాష్ట్రంలో అభివృద్ధి పనులు మరింత ఊపందుకోనున్నాయి.