GDWL: గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగిన ఘటన బుధవారం కేటీ దొడ్డి మండలంలో కలకలం సృష్టించింది. మండల కేంద్రం నుంచి గువ్వలదిన్నె గ్రామానికి వెళ్లే రోడ్డు పక్కన ఉన్న శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో కొందరు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు స్థానికులు తెలిపారు. ఏమి దొరకకపోవడంతో గుంతలన అలానే వదిలి పరారయ్యారు. ఈ విషయంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.