CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ పరిధిలో ఉన్న వసతి సదుపాయాన్ని ఆలయ ఈవో పెంచల కిషోర్ గురువారం పరిశీలించారు. వినాయక సదన్‌లో నూతనంగా నిర్మించిన 3, 4 అంతస్తులను పరిశీలించారు. ఈ మేరకు ఫర్నీచర్ వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ వెంకటనారాయణ, ఏఈలు అరవింద్, పవన్ పాల్గొన్నారు.