BHPL: గణపురం మండల కేంద్రంలోని కోటగుళ్లను ఇవాళ వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్స్ సందర్శించారు. 10 రోజుల శిక్షణలో భాగంగా దేశంలోని వివిధ రాష్ట్రాలు, ఇరాన్ నుంచి వచ్చిన 2025 వాలంటీర్స్ రామప్పలో జరుగుతున్న క్యాంప్‌లో పాల్గొంటున్నారు. శిక్షణలో భాగంగా ఫీల్డ్ విజిట్‌గా కోటగుళ్లను పరిశీలించారు. ఈ ప్రదేశంలోని చారిత్రక ప్రాముఖ్యతను అర్థం చేసుకుని, రక్షణపై చర్చించారు.