KRNL: ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా సీపీఎం, సీపీఐ నేతలు ఎం.రాజశేఖర్, రామకృష్ణారెడ్డి, చంద్రశేఖర్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం కమ్యూనిస్టు పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కే ప్రయత్నమిదని, మోదీ–చంద్రబాబు ప్రజాధనాన్ని వృథా చేస్తూ ప్రజా సమస్యలపై మాట్లాడేవారిని అడ్డుకుంటున్నారని విమర్శించారు.