MBNR: ప్రధాని నరేంద్ర మోడీ గురువారం శ్రీశైలం పర్యటన షెడ్యూల్ విడుదల అయింది. ఢిల్లీలో ఉదయం 7:20 గంటలకు బయల్దేరి 9:50 గంటలకు కర్నూలు (ఓర్వకల్లు) విమానాశ్రయం చేరుకోనున్నారు. అక్కడి నుంచి ఉదయం 10:55 గంటలకు శ్రీశైలం చేరుకుని, 11:15 గంటలకు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను ప్రధాని మోదీ దర్శించుకోనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.