CTR:పెనుమూరులో ఓ బేకరీ యజమాని కరెంట్ షాక్తో మృతి చెందిన ఘటన గురువారం వెలుగు చూసింది. పోలీసుల వివరాలు మేరకు.. తమిళనాడు రామేశ్వరానికి చెందిన బాలమురుగన్ (45) స్థానికంగా శ్రీని స్వీట్స్ & బేకరీ దుకాణాన్ని 20 ఏళ్లుగా నడుపుతున్నాడు. ప్రమాదవశాత్తు బుధవారం రాత్రి ఇంటిలోని షార్ట్ సర్క్యూట్ కారణంగా విద్యుత్ షాక్కు గురై మృతి చెందారు.