ATP: జిల్లాలోని ఆర్టీసీ బస్సులు కర్నూలులో నేడు జరగనున్న ప్రధాని మోదీ సభకు తరలివెళ్లాయి. దీంతో ఆర్టీసీ బస్సుల కొరతతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఉదయాన్నే అనంతపురం బస్టాండ్‌కు వచ్చిన ప్రజలకు బస్సులు లేక గంటలతరబడి వేచి చూస్తున్నారు. జిల్లాలోని అన్ని ఆర్టీసీ బస్సుల డిపోలలో ఇదే పరిస్థితితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.