PLD: అధికార పార్టీ నాయకులు అధికారాన్ని నియోజకవర్గ అభివృద్ధి కోసం ఉపయోగించాలని వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సూచించారు. బుధవారం వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో వంద పడకల ఆసుపత్రి, విద్యార్థినుల కోసం పాఠశాల నిర్మించాలని కోరారు. అభివృద్ధికి కృషి చేయాలి గానీ, ప్రశ్నించే వారి గొంతు నొక్కడం, కేసులు పెట్టడం సరికాదని ఆయన అన్నారు.