NTR: అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల విజేతలకు కలెక్టర్ లక్ష్మీశా గురువారం బహుమతులను అందజేశారు. ఇందులో భాగంగా సమాన అవకాశాలు, నాణ్యమైన విద్య, ఆరోగ్య సంరక్షణలో బాలికలు సాధికారత సాధించాలని కలెక్టర్ అన్నారు. బాల్యవివాహం, వివక్ష, హింసను నివారించడానికి అధికారులు, నాయకుల నుండి ప్రేరణ పొందాలని కలెక్టర్ సూచించారు.