BDK: జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పొదెం వీరయ్య అధ్యక్షతన స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సారథ్యంలో మణుగూరు పట్టణంలో డీసీసీ అధ్యక్షుల దరఖాస్తుల సమావేశం గురువారం నిర్వహించారు. భద్రాద్రి ,ములుగు, భూపాలపల్లి జిల్లాలకు ఏఐసీసీ పరిశీలకుడైన జాన్సన్ అబ్రహాం విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనను అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.