KMM: రఘునాథపాలెం మండలంలో వీధికుక్కల బెడద రోజురోజుకు ఎక్కువవుతుందని స్థానికులు తెలిపారు. మంచుకొండ, పండిగి, కోయచలక, జింకలతండా, బలపేట తదితర గ్రామాల్లో రాత్రి వేళల్లో రోడ్డుపై వెళ్లే వాహనాల వెంట పడి వాహనదారులను గాయపరుస్తున్నాయని అన్నారు. అటు చిన్న పిల్లలపై కూడా దాడికి పాల్పడుతున్నాయని స్థానికులు వెల్లడించారు. కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు తెలిపారు.