VKB: మున్సిపల్ పరిధి శివారెడ్డిపేట్ మైనార్టీ రెసిడెన్సియల్ స్కూల్ & కళాశాల కాంపౌండుకు ఆనుకొని ట్రాన్స్ ఫార్మర్కు రక్షణ కంచె ఏర్పాటు చేయాలని గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇదే మార్గంలో విద్యార్థులు, వాహనదారులు నిత్యం వెళ్తుంటారని తెలిపారు. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని స్థానికులు వాపోతున్నారు.