RR: ఆర్టీసీ బస్సును బోలేరో ఢీకొన్న ఘటన షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండల పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. తొమ్మిదిరేకుల గ్రామ సమీపంలో బొలెరో వాహనం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొంది. ప్రమాదంలో రెండు వాహనాల ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నాయి. ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.