GDWL: ఈనెల 22వ తేదీలోపు రైతులు దరఖాస్తు చేసుకుంటే రాయితీలపై వ్యవసాయ పరికరాలు అందజేస్తామని కేటీదొడ్డి మండల వ్యవసాయ అధికారి రాజవర్ధన్ రెడ్డి తెలిపారు. మండలంలోని ఎస్టీ, ఎస్సీలతోపాటు సన్న, చిన్నకారు రైతులకు 50%, జనరల్ కేటగిరిలో 40% రాయితీ ఉంటుందన్నారు. రకరకాల పరికరాలను యాంత్రీకరణ పథకం ద్వారా అందజేస్తామన్నారు.