MBNR: మిడ్జిల్ మండల వ్యాప్తంగా ఇటీవల ప్రభుత్వం గ్రామ పరిపాలన అధికారులను నియమించింది. అందులోనే భాగంగా శుక్రవారం నుంచి గ్రామాలలో వారు సేవలందించనున్నట్లు ఎమ్మార్వో రాజు తెలిపారు. గ్రామ ప్రజలు ఏ విధమైన ధ్రువపత్రాలు అవసరమున్నచో ముందుగా గ్రామ పరిపాలన అధికారిని సంప్రదించాలన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలోని ఇన్వార్డులో మీయొక్క ధ్రువపత్రాలు ఇవ్వాలన్నారు.