కాకినాడ: కార్తికమాస యాత్రల్లో భాగంగా ఈ నెల 22 నుంచి పంచారామ క్షేత్ర దర్శనానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని కాకినాడ డిపో అసిస్టెంట్ కమిషనర్ ఎంయూవీ మనోహర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులు ఈ నెల 25, 26 తేదీల్లో, నవంబరు 1, 2, 8, 9, 15, 16 తేదీల్లో ప్రతి శని, ఆదివారాల్లో కాకినాడ నుంచి రాత్రి 8 గంటలకు బయల్దేరతాయన్నారు.