NTR: జగ్గయ్యపేట మండలం అగ్రహారంకి చెందిన రైతు మంగయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. అతను KDCC బ్యాంకుకు, సహకార సంఘంలో కృష్ణ ఫార్మర్స్ సొసైటీ సభ్యుడిగా ఉన్నారు. దీంతో జనతా యాక్సిడెంట్ స్కీమ్ పరిధిలో ఆయన కుటుంబానికి శనివారం ₹2 లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేసిన చెక్కును మరణించిన వ్యక్తి భార్య నాగేంద్రమ్మకు, KDCC బ్యాంక్ ఛైర్మన్ నెట్టెం రఘురాం అందించారు.