GNTR: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ శుక్రవారం ప్రారంభమైంది. పొన్నూరు 23వ వార్డులో సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఇంటింటికి తిరిగి సంతకాలు సేకరించారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసి ప్రజలను మోసం చేస్తోందని మురళీకృష్ణ విమర్శించారు. వైసీపీ కార్యకర్తలు వార్డు కమిటీలను పటిష్టం చేయాలని ఆయన కోరారు.