NTR: విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో పగలు రాత్రి ప్రైవేటు అంబులెన్స్‌ల దందా దారుణంగా మారిపోయింది. సిబ్బందితో అంబులెన్స్‌ల మాఫియా మీకింత మాకింత అనే స్థాయిలో సంబంధాలు పెట్టుకొంది. ఎవరైనా చనిపోయినా, లేక కాసేపటిలో చనిపోతారనగా అంబులెన్స్‌ల డ్రైవర్లకు ఫోన్ వెళుతుంది. అంతే వాళ్లు నేరుగా లోపలికి వచ్చి బేరం కోసం ఎదురు చూస్తుంటారు. వేలల్లో నగదు డిమాండ్ చేస్తున్నారు.