RR: బీసీ రిజర్వేషన్ల కోసం 18న రాష్ట్రంలో జరగనున్న బంద్కు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలంతా ఐక్యమత్యంతో పోరాడి చట్టపరంగా రిజర్వేషన్లు సాధిస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందని, పార్లమెంట్లో చట్టాన్ని తెచ్చుకోవడానికి బీసీలందరూ ఉద్యమించాలన్నారు.