విజయవాడ జిల్లా జైలులో జుడీషియల్ రిమాండ్‌లో ఉన్న ఐపీఎస్ అధికారి సంజయ్‌ని అధికారులు ఏసీబీ కోర్టుకు తరలించారు. నేటితో ఆయన రిమాండ్ గడువు ముగియనుండటంతో కోర్టులో హాజరుపరచనున్నారు. ఆయన దాదాపు రూ.1.5 కోట్ల ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు విజిలెన్స్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ACB కేసు నమోదు చేసిన విషయం తెలిపిందే.