NTR: పెనుగంచిప్రోలు మండలం కొనకంచి పాఠశాలలో ఆయుర్వేద వైద్యాధికారిణి వాణి గురువారం సీపీఆర్‌పై అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్ ప్రాణాలను కాపాడుతుందని ఆమె తెలిపారు. ఒక వ్యక్తి శ్వాస, హృదయ స్పందన ఆగిపోయినప్పుడు చేసే అత్యవసర వైద్య ప్రక్రియే సీపీఆర్ అని, గుండె కొట్టుకోవడం, రక్త ప్రసరణ ఆగిపోతే ప్రాణాలను రక్షించేందుకు దీనిని వినియోగిస్తారని తెలిపారు.