ASF: గోండు సామాజిక వర్గంపై కక్ష సాధింపు చర్యలను ITDA పీవో కుష్బూ గుప్తా మానుకోవాలని తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి భగవంతరావు అన్నారు. ఆశ్రమ పాఠశాలలో ఔట్ సోర్సింగ్‌లో విధులు నిర్వహిస్తున్న 220 మందిని తొలగించడాన్ని నిరసిస్తూ తిర్యాని మండల కేంద్రంలో గురువారం నిరసన చేపట్టారు. సమ్మె చేస్తున్న కార్మికులను శాశ్వతంగా విధుల నుంచి తొలగించడం అన్యాయమన్నారు.