ప్రకాశం: ఏపీ ఎన్జీవో అసోసియేషన్ కనిగిరి తాలూకా యూనిట్ ఎన్నికల నోటిఫికేషన్ను ఎన్నికల అధికారి కే. ముంజేష్ కనిగిరి ఎన్జీవో భవనంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్జీవో అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి ఈనెల 26న నామినేషన్ల ప్రక్రియ, ,27న స్క్రూటిని నిర్వహించి, పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామన్నారు. నవంబర్ 2న పోలింగ్ జరుగుతుందన్నారు.